ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పాలన పై విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. `సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని కొనియాడారు పవన్. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం లో వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో 1వ తేదీన వేతనాలు అందలేదన్నారు. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రతీ విషయంలో నిర్లక్ష్యంగానే ఉండిందని గుర్తు చేసారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్ గా మారాయని సీఎం చంద్రబాబు చెప్పారని.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేశామని తెలిపారు.