చనువు ఇచ్చింది కదా అని పులితో సెల్ఫీ దిగాలని చూశాడు..! ఏమైందంటే..

-

మనలో చాలామందికి..సెల్ఫీలు దిగడం అంటే ఎక్కడలేని ఇష్టం ఉంటుంది. ట్రైన్‌ ముందు, జలపాతాల దగ్గర రిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటాం.. ఎన్నో ఘటనలు చూశాం..సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోయారు అని.. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది..అయితే వీళ్ల అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు.. ఎన్టీఆర్‌ డైలాగ్‌ ఉంటుంది కదా.. చనువు ఇచ్చింది కదా అని. పులితో సెల్ఫీ దిగాలని చూస్తే వేటాడేస్తది అని.. మనోళ్లు అలానే అది కూల్‌గా ఉంది అని అత్యుత్సాహం చూపించారు. దాని మూడ్‌ బాగుంది కాబట్టి..ఏం చేయకుండా వెళ్లింది.. అది కానీ వేటకు వచ్చిందంటే.. ఒక్కరు కూడా మగిలకపోయేవారు.. అంత ధైర్యం చేసి మరీ వీళ్లు పులి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసారు..ఇంతకీ ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది. కొంత మంది యువకులు తమ వాహనాన్ని రహదారిపై ఆపి.. అటుగా వెళ్తోన్న పులిని ఫొటోలు తీశారు. అంతటితో ఆగకుండా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆ పులి మూడ్ బావుండి వాళ్లు బతికిపోయారు. ఆ పులి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. లేకపోతే సీన్‌ వేరేలా ఉండేది..

పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోవాలని వీడియో చూసిన అటవీ శాఖ అధికారి సుశాంత్‌ నందా ట్వీట్‌ చేశారు. ఆ వీడియో చూస్తున్న మనకే వామ్మో అనిపించేలా ఉంది.. ఆ సమయంలో యువకులకు ప్రాణాలకంటే ఆ పులితో సెల్పీ దిగేదే ఎక్కువైపోయింది..

చాలామంది ప్రమాదకరం అని తెలిసి కూడా ఆలోచనా శక్తిని కోల్పోయి..ఇలానే చేస్తారు. సముద్రం దగ్గరకు వెళ్లినప్పుడు కూడా కావాలని లోతుకు వెళ్లడం, ట్రైన్‌ వెళ్తున్నప్పుడు దాని పక్కనే ఉండి వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడం, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి దాని అంచుల వెంబడి ఉండి ఫోటోలు దిగడం చేస్తారు.. కాస్త ఆగి ఆలోచించి..ఎందుకు ఇవన్నీ..వాటిని చూస్తే సరిపోదా అనుకుంటే.. అసలు ఎలాంటి ప్రమాదాలు జరగవు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు పెట్టి వైరల్‌ చేద్దాం అనుకుని..అది కాస్త బెడిసి కొట్టి ప్రాణాల మీదకు వస్తే..అప్పుడు ఆ వార్త వైరల్‌ అవుతుంది..! మీరు ఎప్పుడు ఇలాంటి సాహస సెల్ఫీలు తీసుకోకండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version