ఇక్కడ హోలీ పురుషులకు నిషేధం.. కనిపిస్తే లెహంగాలు కట్టి శిక్షిస్తారట

-

ఎంతో సరదాగా జరుపుకునే హోలీ..కొన్ని ప్రదేశాల్లో..సాంప్రదాయల పేరుతో నిబంధనల మాటున జరుపుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో హోలీను మహిళలు మాత్రమే చేసుకుంటారు. వీరి హోలి సంబరాల్లోకి పురుషులు ఎవరైనా పొరపాటున వచ్చారంటే లంగా, జాకెట్‌ను కట్టించి.. హోలీ రంగులు చల్లుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు జరుగుతోంది. ఎందుకు ఇలా.. చేస్తున్నారో మనమూ చూద్దాం..

యూపీలోని హరీమ్‌పూర్‌ జిల్లాలో కుందౌరా అనే కుగ్రామం ఉంది. ఊరి జనాభా ఐదువేలు ఉంటుంది. మూడు రోజులపాటు హోలీ సంబరాలు జరుగుతాయి. మొదటి రోజు మాత్రం పురుషులు రంగులు చల్లుకుంటూ హోలి ఆడతారు. ఇక రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారట. ఆరోజు మహిళలు తమకు నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలి ఆడవచ్చు. ఈ సంబరాల్లోకి మగవాళ్లకు అస్సలు అనుమతి లేదు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు.

అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ నాట్యం చేస్తారు. సంప్రదాయం ప్రకారం మామగారి ముందు కోడళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అందువల్ల పురుషులను ఈ పండక్కి బయటకు రానివ్వరట… పురుషులు ఇంటికే పరిమితమవ్వాలి లేదా ఊర్లో ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యాకే ఊర్లోకి రావాలి. హోలీ రెండోరోజు పురుషులు ఆరుబయట కనిపించడం నిషేధం..కాబట్టి. పొరపాటున ఎవరైనా వచ్చారంటే శిక్షను అనుభవించాల్సిందే… వారికి లెహంగా చోళీ కట్టి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో మహిళలు వారిని కొడుతుంటారట.

మూడో రోజు హోలి పండుగను రామ్‌ జానకి గుడి ప్రాంగణంలో నిర్వహిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద మొత్తం దీనిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ డ్యాన్స్ చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం స్పెషల్ వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు నిషేధం.

ఇలా మొత్తానికి..కొన్ని రూల్స్ తో పండగను ఎంజాయ్ చేస్తారు.. మన దగ్గర హోలీ పెద్దగా జరుపుకోరూ.. హైదరాబాద్ లాంటి సిటీస్ లో అక్కడక్కడా యువత రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. యూత్ కి ఫేవరెట్ ఫెస్టివల్స్ వివాయకచవితి తర్వాత హోలీనే ఉంటుంది. ఇంతకీ మీ ఏరియాలో హోలీ ఆడతారా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version