ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హై స్కూల్‌లో విలీనం చేయాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ముఖ్యంగా 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత బడులకు మ్యాపింగ్ చేయవద్దని, హై స్కూల్‌లోనే వీరి కోసం ప్రత్యేకంగా అదనపు గదులు నిర్మాలని పేర్కొంది. భవనాలు లేని ఉన్నత, ప్రాథమిక పాథమికోన్నత పాఠశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఇక 20 మంది కంటే ఎక్కువ టీచర్లు ఉంటే.. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు నిర్మించాలని పేర్కొంది.
ముఖ్యంగా ఇంతకు ముందు ఏపీలో ఉన్నత పాఠశాలల కంపౌండ్‌లో జరుగుతున్న ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలకు ఆనుకుని ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించడంతో కలిపిన విషయం తెలిసిందే. ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతులను యధావిధిగా నిర్వహించాలని సూచించారు.