వరల్డ్ మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైస్ అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నిజమో కాదో తెలియని అయోమయంలో ఉన్న ఫ్యాన్స్‌కు మైక్ ఓ క్లారిటీ ఇచ్చారు. మైక్ టైసన్ టీవల మియామి విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో కనపడడంతో అతడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.
అయితే తాను సయాటికా సమస్యతో బాధపడుతున్నట్లు తాజాగా టైసన్ వెల్లడించాడు. ఈ సమస్య వల్ల వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రమైనప్పుడు తాను నడవలేనని కనీసం మాట్లాడలేనని, ప్రస్తుతం బాగానే ఉన్నానని టైసన్ తెలిపాడు.
ఇటీవలే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్ సినిమాలో విలన్‌గా మైక్ టైసన్ నటించారు. ఆ సినిమా చిత్రీకరణ ముగిసినప్పటి నుంచే టైసన్ ఆరోగ్యం కాస్త బాగాలేనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా టైసన్ త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.