Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎంఐఎం

-

మరో నెలరోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై గురి పెట్టాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ సిద్ధమైంది. తాము 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు.. ఉస్మాన్ ఘనీ ఇవాళ వెల్లడించారు. జేడీఎస్​ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సుముఖంగా ఉన్నట్లు ఉస్మాన్ ఘనీ తెలిపారు.

“జేడీఎస్​తో ఎమ్​ఐఎమ్​ పొత్తుపై ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రధాని ఎచ్​డీ దేవేగౌడతో.. చర్చలు జరుపుతున్నాం. పార్టీ అభిప్రాయాన్ని ఆయనకు చెప్పాం. కానీ దేవెగౌడ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు” అని ఉస్మాన్ ఘనీ అన్నారు.

ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్​ లోక్​సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సైతం తాము కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. జేడీఎస్​తో​ పొత్తుకు ఎంఐఎం సిద్ధంగా ఉందన్న ఆయన.. దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. పొత్తు కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version