“బాబోరి” నెల్లూరు పర్యటనకు భారీ ఏర్పాట్లు… అసలు సంగతేంటి !

-

ఏపీ ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడు ప్రస్తుతం అధికార దాహంతో ఉన్నాడని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా … గెలిచిపోయి సీఎం అయిపోదామా అన్న కోరికతో రగిలిపోతున్నాడు. అందులో భాగంగా చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ పోతున్నాడు. అంతే కాకుండా ఈ మధ్యన వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వలన ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. కాగా చంద్రన్న ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లాకు విచ్చేయుచున్నాడు. ఈ పర్యటనలో టీడీపీ జోన్ 4 మీటింగ్ భారీగా జరగనున్నట్లు తెలుస్తోంది.

 

గత రెండు రోజుల నుండి ఈ మీటింగ్ కు ఎన్టీఆర్ నగర్ హైవేకు పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి కాలేజ్ గ్రౌండ్ లో పనులు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభి రాజా నాయుడు దగ్గరుండి చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version