జ‌గ‌న్‌పై న‌యా మైండ్ గేమ్‌… వాళ్లిద్ద‌రు క‌లిసిపోయారా…!

-

ఔను! ఇప్పుడు ఇదే విషయంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాస్తవానికి బీజేపీలోకి చేరిపోయినా.. రాజ్యసభ సభ్యుడు సుజనా రాజకీయ మూలాలన్నీ కూడా టీడీపీలోనే ఉన్నాయి. ఆయన వ్యూహాత్మకంగానే పార్టీ మారిపోయారనే వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఆయన చంద్రబాబు కనుసన్నల్లోనే రాజకీయాలు చేస్తున్నార ని అనేవారు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా టీడీపీ కోణంలోనే ఉంటున్నాయి.

జగన్‌ ప్రభుత్వంపై సుజనా చౌదరి చేస్తున్న వ్యాఖ్యలు హెచ్చరికలు వంటివి టీడీపీ ఆలోచనల నుంచే ఉద్భవిస్తున్నాయని చెప్పేవారు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ-బీజేపీ సంయుక్తంగా ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతాయనే ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు సుజనా చౌదరి చేస్తున్న విమర్శలు ఏమేరకు ఫలించనున్నాయి. రాష్ట్రంలో పార్టీ సీనియర్లు ఎందరో ఉన్నాకూడా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన సుజనాకు కమల నాథులు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారు? అనే చర్చ కూడా తెరమీదికి వస్తోంది.

తాజాగా సుజనా చౌదరి అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి. రాజధానిని అంగుళం కూడా తరలించేందుకు జగన్‌కు హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో న్యాయపోరాటం అంటూ.. సరికొత్త వివాదాన్ని ప్రోత్సహించేందుకు రెడీ అయ్యారు.వాస్తవానికి నాలుగు రోజుల కిందటే ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి న్యాయపోరాటం అనే వ్యాఖ్య వినిపించింది.

ఇప్పుడు సుజనా కూడా దీనిని తెరమీదికి తెచ్చారు. సో.. ఆయన భౌతికంగాబీజేపీలో ఉన్నా.. కూడా టీడీపీ వాయిస్‌ను వినిపిస్తున్నారనేందుకు ఇది చక్కటి ఉదాహరణ. ఇక, రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ఉన్న రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఇదే జరిగితే.. కేంద్రమే న్యాయవ్యవస్థ ముందు దోషిగా మారుతుంది. ఇది గతంలో జార్ఖండ్‌ రాజధాని విషయంలోనూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఓ ప్రాంతాన్ని నిర్ణయించగా వివాదం ఏర్పడి విషయం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు రాష్ట్ర రాజధానులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పూర్తిగా అధికారం ఉందని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు సుజనా ఈ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకొంటూనే కేంద్రాన్ని ఇన్వాల్వ్‌ చేయడం ద్వారా జగన్‌తో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version