ఏపీ-అమూల్ ఒప్పందంతో హెరిటేజీను టార్గెట్ చేశామనడం నిజం కాదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఒప్పందం వలన సుమారు 200 లక్షల లీటర్ల మేర పాలు ఎలాంటి వ్యవస్థ లేకుండానే సరఫరా అవుతున్నాయని, పోటీ ఉంటేనే పాడి రైతులకూ లాభం ఉంటుందిన్ అన్నారు. ఆవు పాల లీటరుకు ప్రస్తుతం సుమారు రూ. 30 ఇస్తున్నారు.. ఈ ఒప్పందంతో మరో రూ. 3-4 పెరగొచ్చని ఆయన అన్నారు. పాల సేకరణ కేంద్రాల నిర్మాణం, మిల్క్ చిల్లింగ్ సెంటర్ల వద్ద మౌళిక సదుపాయాల కోసం నిధులకు ఇబ్బంది లేదని ఆయన అన్నారు.
ఈ నెల 20 నుంచి పాల కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం కానున్నాయన్న ఆయన ఈ నెల 25 నుంచి ఆమూల్ మిల్క్ ద్వారా చెల్లింపులు కూడా మొదలు కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని అన్నారు. ప్రస్తుతం 70 లక్షల లీటర్లు మాత్రమే ప్రతి రోజు సేకరిస్తున్నారని ఇది రాష్ట్ర పాల ఉత్పత్తిలో 26 శాతమేనని అన్నారు. మిగిలిన 200 లక్షల లీటర్ల సేకరణకు ఆమూల్ తో ఒప్పందం ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో పాల సేకరణ ఈ నెల 20న ప్రారంభిస్తామని ఆయన అన్నారు.