కేసీఆర్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు సముచిత స్థానం : మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్‌ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ధూప దీప నైవేద్య సంఘం అర్చకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు అర్చకులు మంత్రి ఎర్రబెల్లిని ఘనంగా సత్కరించారు.

అంతే కాక, కంటేపాలెం గ్రామంలో, రాకపోకలకు అంతరం కలుగుతుందని తెలుసుకున్న మంత్రి దయాకర్ రావు కండే పాలెం చెరువును పరిశీలించి పూజలు చేశారు. అదేవిధంగా తొర్రూర్ లోని పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో చెరువు వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి దయాకర్ రావు పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version