టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది : మంత్రి ఎర్రబెల్లి

-

టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నాయకులు సల్పుగొండ ముత్తయ్య, వెంకట నర్సు, తండా యాకయ్య తదితరులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే గర్భవతులు కావడంతో ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో సంభవిస్తాయన్నారు. రక్త హీనత ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బాల్య వివాహాల కట్టడికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. బాల్య వివహాలు చట్టరీత్యా నేరం అన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version