జనగామ జిల్లా దేవర్పుల లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరి రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన టిఆర్ఎస్ కార్యకర్తలను ఆసుపత్రిలో పరామర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
“జెండా కార్యక్రమం వద్ద టిఆర్ఎస్ నాయకులు దేవరుప్పుల వద్ద ఉండగా, అక్కడకి వచ్చిన బిజెపి వెంట ఉన్న 500 మంది గుండాలు దాడి చేయగా 5 గురికి గాయాలు అయ్యాయి. సత్తమ్మ అనే మహిళ అక్కడ జెండా కార్యక్రమనికి చూడడానికే వచ్చిన ఆమె ప్రత్యేక సాక్ష్యం. పోలీసులు కూడా సరయిన తిరుగ స్పందించలేదు.
నేను ఈ విషయంలో డిజిపి గారికి కంప్లైంట్ చేస్తాను. బాద్యులపై చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ మీ పాదయాత్ర చేసుకంటే సవ్యంగా చేసుకో గాని ,ఎదో లబ్ది పొందడం కోసం,సింపతి కోసం మీరు గుండాలతో తిరుగుతే ప్రజలే తిరుగబడతారు”. అంటూ హెచ్చరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.