విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ సంక్షేమ డైరీ – 2025ను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కేవలం భారతదేశానికి మాత్రమే కాక ఇతర దేశాల వారికి కూడా ఆదర్శం. అసమానతలు లేని రాజ్యాన్ని చూడాలన్నదే బీఆర్ అంబేద్కర్. సంస్థలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
విద్యుత్ శాఖలోని కార్మికులు, ఇంజనీర్లతో పాటు అన్ని వర్గాలకూ కూడా న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయి. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నష్టాల ఊబిలోకి తోసి, సర్వనాశనం చేసింది. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణల అమలుతో విద్యుత్ శాఖను మరలా గాడిలో పెడుతోంది. విద్యుత్ శాఖ పునర్వ వైభవం కోసం ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే జేఏసీ తో సమావేశం ఉంటుంది అని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు.