అమిత్ షా వలస పక్షి.. హరీష్‌ రావు ఆసక్తికర ట్వీట్‌

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో.. అమిత్‌ షా పర్యటనపై మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు. శ‌నివారం ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వం సంద‌ర్భంగా ట్వీట్ చేసిన హ‌రీశ్ రావు… అమిత్ షాను కూడా వ‌ల‌స ప‌క్షుల‌తో పోల్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వ‌ల‌స ప‌క్ష‌లు త‌మ‌కు ఇష్ట‌మైన ప్రాంతాల‌కు వ‌స్తుంటాయ‌ని పేర్కొన్న హ‌రీశ్ రావు.. ఆయా ప్రాంతాల్లో ల‌భించే ఆహారాన్ని ఎంజాయ్ చేస్తాయ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత అక్క‌డే గుడ్లు పెట్టి తిరిగి త‌మ ప్రాంతాల‌కు వెళ్లిపోతాయ‌ని ఆయ‌న తెలిపారు. అదేంటో గానీ అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న కూడా వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వం నాడే జ‌రుగుతోంద‌ని, ఇది యాధృచ్చిక‌మ‌ని హ‌రీశ్ రావు సెటైర్ సంధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version