Harish Rao : వైద్యవిద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

-

హైదరాబాద్‌ మహా నగరంలోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్ర‌వారం ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు గారు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకుని, నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష‌ నిర్వహించారు మంత్రి హరీశ్ రావు.

ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి మంత్రి హరీశ్ రావు… అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌కు ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా కల్పించారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version