ఏపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. నేడు సంగారెడ్డి జడ్పీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి వచ్చే 30 వేల కోట్లను కేంద్రం ఆపిందన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకుందని ఆరోపించారు. 1350 కోట్లు వెనుకబడిన జిల్లాల నిధి కేంద్రం ఆపిందన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని.. నీతి అయోగ్ ఇవ్వాలని చెప్పినా 1300 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వలేదన్నారు. రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుందని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదని.. అదనంగా యూనిట్ కి 20 రూపాయలు ఇచ్చి విద్యుత్ కోసం నెలకు 1500 కోట్లు చెల్లించి విద్యుత్ తీసుకుంటున్నామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version