తెలంగాణ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉన్నదని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లు పెద్దవ చేసుకొని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. సీఎం జగన్ ప్రణాళికబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసిందని.. గత ప్రభుత్వం కేవలం రెండు కోట్ల మెట్రిక్ టన్నుల వరకే ధాన్యాన్ని కొనుగోలు చేసింది అన్నారు.
ఈ ప్రభుత్వం 32లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించిందని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 58వేల కోట్లు చెల్లించినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సీడీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని.. మంతరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. కొడాలి నాని చిటికెన వేలు కూడా పీకలేవు అని లోకేష్ పై మంత్రి మండిపడ్డారు. లోకేష్ అసలు మనిషేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.