కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని రైస్ మిల్లులతో తనిఖీలు చేయాలని ఎఫ్సీఐని ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన నిల్వలు ఉండటం లేవని, ఎఫ్సీఐకి చెందిన అధికారులు వాటిని గుర్తించి ఎక్కడెక్కడ బియ్యం ఎందుకు ఉండటం లేదు… కొరత ఎందుకు వస్తుందనే విషయంపై తనిఖీలు చేశామని… ఇప్పటి వరకు 40 రైస్ మిల్లులను తనిఖీ చేస్తే అందులో 4,53,896 బస్తాల బియ్యం తక్కువగా ఉందని తేలిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన… తెలంగాణలో రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఎఫ్సీఐకి ఆదేశం
-