తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిల పాదయాత్రను ఆపేసి అమెరికాకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.దీంతో తన పాదయాత్రకు మరో సారి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు గా తెలుస్తోంది.ఈ నెలాఖరు వరకు కొనసాగించి..వచ్చే నెల మొత్తం విరామం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు.ఆమె వ్యక్తిగత పనుల కోసం అమెరికాకు వెళ్లనున్నారని వైఎస్సార్ టిపీ వర్గాలు చెబుతున్నాయి.తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించిన షర్మిల…ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చేరుకున్నారు.ఇప్పటివరకు షర్మిల 791 కిలోమీటర్ల దూరం నడిచారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఒకసారి యాత్రను వాయిదా వేశారు.ఆ తర్వాత కరోనా కారణం గా చాలా రోజులు ప్రజాప్రస్థాన యాత్రకు బ్రేకులు పడ్డాయి.కాగా ఇప్పుడు మరోసారి యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు.అయితే షర్మిల పాదయాత్ర అనుకున్నంతగా పార్టీకి ఊపు తీసుకురాలేక పోతుంది.ఎక్కడా ఈ పార్టీకి క్యాడర్ లేకపోవడంతో ఒకే కార్యకర్తలు వెంట నడవాల్సివస్తుంది.మీడియాలోనూ అనుకున్నంత బజ్ రావడం లేదు.ఇతర పార్టీలు వైఎస్సార్ టీపీ ని ఓ పార్టీ గా పరిగణించే పరిస్థితి లేకుండా పోయింది.అయినా షర్మిల పట్టువదలకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.కాగా అమెరికా పర్యటన తర్వాత షర్మిల పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వైయస్సార్ టిపీ వర్గాలు చెబుతున్నాయి.