కొడాలి నాని సవాల్.. అలా జరగకపోతే రాజకీయాలకు గుడ్‌బై…!

-

ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, టీడీపీ నేతల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం స్థానాలు గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. కార్మికుల సొమ్మును దోచుకుతినే అచ్చెన్నాయుడు, గాలి నాయుడు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగు కాక తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ రాసిన లేఖపై కూడా మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్‌ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా తాము గుర్తించమని పేర్కొన్నారు. 2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version