చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకేనా?

-

ఏపీ మంత్రి కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్నారు. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు అనుచరుడిగా ఉన్న నాని, ప్రస్తుతం జగన్ నమ్మిన నేతగా కొనసగాతుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపైన ఎవరైన ఆరోపణలు చేస్తే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటారు కొడాలి నాని. అయితే, ఈ క్రమంలోనే తీవ్రపదజాలంతో దూషిస్తుంటారు నాని. తాజాగా గుంటూరు ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య‌ను నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఈ విషయమై చర్యలు తీసుకోవాలంటూ విపక్షాలు టీడీపీ, వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు, మంత్రులు నిందితుడి విషయంలో సర్కారు చేపట్టే చర్యల గురించి వివరించాల్సి ఉంటుంది. మహిళల సంరక్షణ విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్ తెలపాలి. తీసుకున్న, తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలి. కానీ, ఇవేవీ చేయకుండా మంత్రి కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి మంత్రి నిరాశలో ఉన్నారనే చర్చ జరుగుుతన్నది. చంద్రబాబులాంటి వెధవ దళిత యువతిని హత్య చేశాడని, దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రికి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు.

వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, యువతిని హత్య చేసిన నిందితుడికి తేడా లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మంత్రి నాని. ఈ క్రమంలో మంత్రి నాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? అనే ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి వస్తున్నది. అయితే, ప్రభుత్వం తరఫున వాదనను వినిపించొచ్చు. కానీ, ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వాదించే వారున్నారు. అయితే, మంత్రి కొడాలి నాని ఫ్రస్టేషన్‌లో ఉండి ఇలా మాట్లాడుతున్నారనే వాదన వినిబడుతోంది. ఇలా నోటికి వచ్చినట్లు మట్లాడితే వైసీపీ ఇమేజ్ దెబ్బతినే చాన్సెస్ ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version