సోనియాగాంధీ, ఖర్గేతో మంత్రి కొండా సురేఖ.. ట్వీట్ వైరల్

-

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే, ఏఐసీసీ సీనియర్ మెంబర్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ఈ మేరకు వారితో కలిసి దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారితో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు,సమకాలీన అంశాలపై చర్చలు జరిపినట్లు మంత్రి కొండా సురేఖ రాసుకొచ్చారు.కాగా, బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పాల్గొనేందుకు మంత్రి కొండా సురేఖ, మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక కాంగ్రెస్ నేతలు హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version