బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్రమంత్రి బండి సంజయ్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే యూనివర్సిటీ వరకు మార్చ్ నిర్వహిస్తామన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధి కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ మీద చేస్తున్న విమర్శలకు ఏమంటారని ప్రశ్నించగా.. బండి సంజయ్ అనే వ్యక్తి ఐటమ్ నంబర్ 6 అని సెటైర్లు వేశారు. కేంద్రంలో ఉండే వ్యక్తి భారత ప్రభుత్వం జారీ చేసే రిపోర్టులు, ఆదేశాలన క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలని సూచించారు. ఎప్పుడూ తంబాకు నములుకుంటూ ఉండటమే కాదని..అప్పుడప్పుడు కేంద్రం ఇచ్చే రిపోర్టులు కూడా చదవాలని హితవు పలికారు.