దేశాన్ని పరిపాలించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో తూర్పారబట్టిన ఎమ్మెల్యే జగత్‌సింగ్ నేగి ఇంటిపై ఈడీ లేదా ఐటీ, సీబీఐ దాడులు తప్పవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీలో జగత్‌సింగ్ చేసిన ప్రసంగం వీడియోను రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. చాలా క్లుప్తంగా వాస్తవాలను వివరించిన ఆ ఎమ్మెల్యే ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వినాలని ట్వీట్ చేశారు.
అయితే ఆ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ఈడీ, లేదంటే ఐటీ, సీబీఐ ఇప్పటికే సిద్ధమై ఉంటాయంటూ బీజేపీ విధానాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ కాలికి గాయం కావడంతో ఇంటి వద్దనే ఉండి రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు మంత్రి కేటీఆర్.