పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్సే : కేటీఆర్‌

-

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే స్కీములు..కాంగ్రెస్ వస్తే స్కాములని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ చేతికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో ఏటూ జడ్ స్కాములేనని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారుతారని.. సీల్డ్ కవర్ సీఎంలు వస్తరని ఎద్దేవా చేశారు. వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మాట్లాడిన కేటీఆర్.. గ్యారంటీ, వ్యారంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని.. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంటు వస్తదని చెప్పారు. పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వనపర్తిని పట్టించుకోని చిన్నారెడ్డి ఇపుడు సన్నాయి నొక్కులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఏపీ నీళ్లు తీస్కపోతుంటే హారతి పట్టింది కాంగ్రెస్ లీడర్లు కాదా అని ప్రశ్నించారు. నీళ్లిచ్చింది బీఆర్ఎస్…కన్నీళ్లీచ్చింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువులు కన్నీళ్లని ఎద్దేవా చేశారు.

ఇది ఇలా ఉంటె, భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేకు పట్టింపు లేకపోవడం, తనకు నచ్చిన వారిని పెంచి పోషిస్తూ వాళ్లతో గ్రూపులు కట్టడంపై ఆ పార్టీ నేతలు గతంలోనే అనేకసార్లు బహిరంగ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలకు విసిగి వేసారి మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకునానరు. శుక్రవారం ఈమేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మానుకోట ఎంపీ కవిత, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version