కేంద్ర ప్ర‌భుత్వానికి తెలంగాణ ప్ర‌భుత్వం బ‌హిరంగ లేఖ‌

-

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల (STPI) ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ అన్యాయంపైన కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన 22 నూతన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అప్ ఇండియా (STPI) లో తెలంగాణకు ఒక్కటి కేటాయించకపోవడం పట్ల కేటీఆర్ ఆవేదన వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ యువత ఉపాధి అవకాశాలకు తీవ్ర విఘాతం క‌లిగింద‌ని.. ఇప్పటికే హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసి ఇక్కడి యువత ఐటీ రంగానికి అన్యాయం చేసింద‌ని వెల్ల‌డించారు.

ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంద‌ని.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ లకు 22 ఎస్టిపిఐలను కేటాయించింద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ఇప్పటికే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు చేపట్టిన కార్యాచరణను తన లేఖలో స్ప‌ష్టం చేశారు.

 

ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎస్టిపిఐలను కేటాయించాలని కోరిన కేటిఅర్..కేంద్రం ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న ఆలోచనను, విశాల దృక్పథాన్ని కేంద్రం అంగీకరించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version