11వ తారీఖున మోడీ ఇంటి దగ్గర ధర్నా చేస్తాం – మంత్రి కేటీఆర్

-

11 వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం లో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్విట్ పెట్టారు,రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని.. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని.. ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారని.. వరిని గతంలో కొన్నట్లు కొనమని కేంద్రాన్ని కోరినామని చెప్పారు. పీయూష్ గోయల్ ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదు…మీ ప్రజలకు నూకలు తినిపియ్యడం నేర్పించాలని అవమనించాడు.. ఉప్పుడు బియ్యం దేశం నుంచి కోటి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రపంచ డేశాలకు ఎగుమతి చేస్తుందని మండిపడ్డారు.

పీయూష్ గోయల్ లజ్జ లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు… సీజన్ మొదట్లోనే వరి పంట వేయొద్దని మేము చెప్పమని పేర్కొన్నారు. పియూష్ గోయల్ కు బలుపు అని.. ఢిల్లీ బీజేపీ ఒక మాట సిల్లి బీజేపీ ఇంకోటి చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దామని.. 8 వ తారీఖున తెలంగాణ లో ఉన్న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి ప్రతి ఊర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనము చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version