NDTVని అన్ ఫాలో చేసిన కేటీఆర్‌.. ఎందుకంటే..?

-

ప్ర‌ణ‌య్‌రాయ్ సార‌ధ్యంలోని టీవీ చానెల్ గ్రూప్ `న్యూఢిల్లీ టెలివిజ‌న్ లిమిటెడ్ (ఎన్డీటీవీ – NDTV) ను భారత సంపన్నుడు గౌతం అదానీ టేకోవ‌ర్ చేశారు. ఈ టేకోవర్ ఒక బాధ్య‌త అని ఇండియ‌న్ బిలియ‌నీర్ గౌతం అదానీ చెప్పుకొచ్చారు. అయితే.. దీంతో.. ఎన్డీటీవీని ట్విట్టర్ లో అన్ ఫాలో చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు చేసిన మంచి పనికి ధన్యవాదాలు అనే క్యాప్షన్ తో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. కాగా NDTVలో మెజార్టీ వాటా గౌతమ్ అదానీ దక్కించుకోవడంతో కో ఫౌండర్ ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధికా రాయ్ రాజీనామా చేశారు.

వాళ్ల స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్ – కంపెనీ బోర్డులో కొత్త డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం NDTV లో అదానీ వాటా 55.18 శాతానికి చేరింది. అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (VCPL) సంస్థ గతంలో NDTVకి రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని NDTVలో వాటాగా అదానీ గ్రూప్‌ మార్చుకుంది. దీనికి అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. దీంతో ఇప్పుడు 34 ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్డీటీవీ అదానీ సొంతమైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version