రేవంత్ రెడ్డి పెద్ద లుచ్చా.. బ్రోకర్ : మల్లా రెడ్డి కౌంటర్

-

కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ, బట్టెబాజ్ అని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లుచ్చా లోఫర్ మాటలు మాట్లాడుతున్నాడని… ఆయన ఒక బ్రోకర్ అని నిప్పులు చెరిగారు. పీసీసీ కూడా అలాగే తెచ్చుకున్నాడన్నారు. మూడు చింతల పల్లి కేసీఆర్ దత్తత గ్రామమని..సీఎం కేసీఆర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

మూడు చింతల పల్లి మండలం మొత్తం తెరాస సర్పంచులు, ఎంపీటీసీ లే ఉన్నారని పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు దీక్ష చేసాడో తెలియదని మండిపడ్డారు.

అనేక మందికి మంచినీళ్లు, పెన్షన్లు వస్తున్నాయని …ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని లబ్ది పొందిన వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లే కార్డ్స్ పెట్టి నిరసన తెలిపారని స్పష్టం చేశారు. అందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని చురకలు అంటించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం పథకాలు లేని ఇల్లు లేదని…మిగితా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు చేయలేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version