భారత దేశంలో ఏపీనే ఎక్కువ పెన్షన్ల పంపిణీ చేస్తుంది : పయ్యావుల కేశవ్

-

EAP ప్రాజెక్టులనూ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఛిన్నాభిన్నం చేసేసింది. 11 పథకాలు దాదాపు 27250 కోట్ల రూపాయల కేటాయింపులతో ఉన్నాయి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇవి రోడ్లు, ఇరిగేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్, NDB, AIB, ADB, JICA, KWF.. ఇలాంటి ప్రాజెక్టులకు సరైన పేమెంట్స్ లేక ఆగిపోయాయి.

అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం పరపతి పోగట్టారు. తిరిగి వాటిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. మళ్లీ ఇక్కడ బ్రాండ్ చంద్రబాబే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది. ఇన్ని ఇబ్బందులున్నా.. సంక్షేమానికి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాం. గతంలో ఫించన్లను 200 రూపాయల నుంచి 2000 రూపాయలు.. ఇప్పుడు 4000 రూపాయలు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. దాదాపు 63.36 లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. ఏడాదికి 32520 కోట్ల రూపాయల మేర పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం. భారత దేశంలో మనమే అత్యధికంగా పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. పెన్షన్ల పంపిణీ బరువుతో కూడుకున్నా.. ప్రేమతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version