గల్ఫ్ బాధితులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాభవన్‌ వేదికగా వారానికి 2 రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విపరీతైన స్పందన వచ్చింది.దీంతో ఇప్పుడు మరో కొత్త కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. ముఖ్యంగా గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ పేరుతో ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని కూడా ప్రజావాణి లాగానే వారానికి 2 రోజులు (బుధ,శుక్ర) వారాల్లో నిర్వహించనున్నారు.

శుక్రవారం ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి సంయుక్తంగా ‘ప్రవాసి ప్రజావాణి’ని ప్రారంభించారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు,ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్‌ తెరిచి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరయ్యారు

Read more RELATED
Recommended to you

Exit mobile version