ఏపీ మంత్రి రోజా మంచి మనసు చాటుకున్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత చికిత్స అందించడానికి, కంటి పొరలున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి #RojaCharitableTrust ఆద్వర్యంలో భారీ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రోజా.
రోజా ఛారిటబుల్ ట్రస్టు – శంకర నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించనున్నారు.ఈరొజు నుండి ప్రారంభమయ్యే ఈ వైద్య శిబిరం ఈ నెల 10వ తేది వరకు కొనసాగనుంది. ఎన్నడూ లేని విధంగా 8 రోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు కంటి సంబందిత జబ్బులకు ఉచిత వైద్య చికిత్స అందించడం జరుగుతోందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన #MobileEyeSurgicalUnit వాహనం ద్వారా Microscopic Small Incision అనే అధునాతన పద్దతిలో ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ చేసేవారికి ఆపరేషన్‌తో పాటు ఐవోఎల్ లెన్స్, కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించనున్నారు.
ముఖ్య గమనిక:
• చికిత్సకు విచ్చేసే వారు నగరి మున్సిపాలిటీకి చెందిన వారైతే 9030571715 నెంబరుకు,
• నగరి మండలానికి చెందినవారైతే 9398520622 నెంబరుకు,
• పుత్తూరు మున్సిపాలిటీ అయితే 9493565747 నెంబరుకు,
• పుత్తూరు రూరల్ మండలం అయితే 9866881427 నెంబరుకు,
• విజయపురం మండలం అయితే 6305896004 నెంబరుకు,
• నిండ్ర మండలం అయితే 9866142258 నెంబరుకు,
• వడమాలపేట మండలం అయితే 9948871188 నెంబరుకు సంప్రదించాలని కోరారు రోజా.