తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..మంత్రి సత్యవతి ఆసక్తిక కర వ్యాఖ్యలు !

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన, అవసరం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు మంత్రి సత్యవతి. నిర్మల సీతారామన్ , కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తి గా ఖండిస్తున్నానని.. కేంద్రమంత్రి ఒక పార్లమెంటుకు పరిమితమై పనిచేయడం సిగ్గుచేటు అని ఆగ్రహించారు.

బిజెపికి ఈ రాష్ట్రంలో తావులేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు వచ్చేది మూడో స్థానమేనని చురకలు అంటించారు. బీహార్ కూలీలు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది వున్నారు, తెలంగాణలో అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని.. బీహార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడిన విషయం అందరూ చూశారన్నారు.

కిషన్ రెడ్డి గారికి తెలుగు తప్ప ఇతర భాషలు రావు,అర్థం కావు అనుకుంటా… కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలుగా ఈ రాష్ట్రం కోసం ఏం సాధించారు చెప్పాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించడం లేదా…. తెలంగాణకు రావాల్సిన వాటాను,ప్రాజెక్టులకు జాతీయ హోదాను అడ్డుకుంటున్న ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తెలంగాణకే ఏం తెచ్చారు ముందు చెప్పి.. మాట్లాడితే బాగుంటుందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version