రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మాట్లాడడానికి మోడీకి మనసెలా వచ్చింది? – సత్యవతి రాథోడ్

-

సింగరేణిలో బొగ్గు బ్లాక్ లను వేలం ద్వారా విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంటుంది. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ.. దీంట్లో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిరసనను వ్యక్తం చేయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గెలుపు మేరకు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు బిఆర్ఎస్ నాయకులు.

ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి లో చేపట్టిన ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మిషన్ భగీరథ కోసం సహకరించమని మోదీని కోరామని.. అయినా తెలంగాణ పైన మోదీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

4 కోట్ల మందికి త్రాగడానికి 20 కోట్లు ఇవ్వమంటే మోడీకి మనసు రాలేదు కానీ.. ఒక ఎమ్మెల్యేను కొనేందుకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ని గెలిపించుకునేందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో? అని ఆరోపించారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటినుండి ఆయన బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. పేపర్ లీక్ చేసిన వ్యక్తిని మందలించాల్సింది పోయి పరామర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని మాట్లాడడానికి మోడీకి మనసు ఎలా వచ్చిందని అన్నారు మంత్రి సత్యవతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version