మా బాధను ఎవరూ తీర్చలేరు.. ప్రణయ్ తల్లిదండ్రులు ఎమోషనల్‌ !

-

మా బాధను ఎవరూ తీర్చలేరు.. అంటూ ప్రణయ్ తల్లిదండ్రులు ఎమోషనల్‌ అయ్యారు. కోర్టు తీర్పు తర్వాత ఆవేదనకు లోనయ్యారు ప్రణయ్ తల్లిదండ్రులు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు తర్వాత మీడియాముందు కన్నీరుమున్నీరయ్యారు ప్రణయ్ తల్లిదండ్రులు. మా బాధను ఎవరూ తీర్చలేరని తెలిపారు. ఎవర్ని చూసినా మా కొడుకే గుర్తుకు వస్తున్నాడన్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి. చంపుకోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

pranay father

మాకు ఎవరిమీద కోపం లేదన్నారు. కేవలం ఈ హత్యలు ఆగాలనే సాక్ష్యం చెప్పామని వివరించారు. న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చిందన్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి. అంతకు ముందు..ప్రణయ్ కేసులో తీర్పు వెలువడిన అనంతరం కుమారుని సమాధి వద్ద నివాళులర్పించారు తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్.

https://twitter.com/bigtvtelugu/status/1899004667805176054

https://twitter.com/bigtvtelugu/status/1899007094566625663

Read more RELATED
Recommended to you

Exit mobile version