తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ,వార్డు సభలు గందరగోళంగా సాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో రోజు గ్రామ, వార్డు సభలు కొనసాగుతున్నాయి.
తాజాగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో గ్రామసభ నిర్వహించగా అది కాస్త బోసిపోయింది. మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపూరిలో గ్రామ సభకి ప్రజలు,మహిళలు హాజరుకాలేదు. ప్రజల నుంచి స్పందన కరువు కావడంతో చేసేదీ ఏమీ లేక అధికారులు ఖాళీగా కూర్చున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంత్రి నియోజకవర్గంలోని ప్రజలకే ప్రభుత్వం మీద నమ్మకం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.