సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోము మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇంత జరుగుతున్నా స్థానిక BJP నేతలు నోరు మెదపరా ? అని నిలదీశారు. రైల్వే అధికారులు బస్తీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల హమాలీ బస్తీలో బస్తీ దవాఖానా ను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.