ఇండ్లులేని వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారందరికీ రూ.5 లక్షలు !

-

తెలంగాణలో త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని… ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR-TRS

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో కేంద్రం వాటా 15%, గడిచిన మూడేళ్ళుగా కేంద్రం డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి వందల కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని… సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,91,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని.. ఇప్పటి వరకు2,27,000 ఇండ్లను మొదలు పెట్టామని వెల్లడించారు. ఇందులో 1,03,000 ఇండ్లు పూర్తి అయ్యాయని… 70,000 ఇండ్లు 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. 53,000 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల నిర్మాణం కోసం 10,442 కోట్లు ఖర్చు చేసామని ప్రకటించారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version