సినిమాకు వెళ్లేందుకు డబ్బులు ఇవ్వలేదని మైనర్ బాలుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈదమ్మ గుడి కాలనీలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మైనర్ కార్తీక్ తండ్రి గణేష్ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. తల్లి సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటుంది.
అయితే, తల్లిదండ్రులు గుడికి వెళుతున్న క్రమంలో కొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడిగాడు. తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోగా..డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్డడ్డాడు.విషయం తెలియడంతో బాధిత పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
సినిమాకి వెళ్లడానికి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని మైనర్ బాలుడు ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈదమ్మ గుడి కాలనీకి చెందిన మైనర్ బాలుడు కార్తీక్ తండ్రి గణేష్ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తుంటాడు తల్లి సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటుంది
అయితే తల్లిదండ్రులు గుడికి వెళుతున్న… pic.twitter.com/YoybRU7mIz
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025