అలర్ట్‌ : 10 జిల్లాల్లో భీక‌ర వాన‌ల.. అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ

-

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అనుకున్నదాని కంటే ముందుగానే కేరళలో ప్రవేశించనున్నాయి. దీంతో.. కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో భీక‌ర వాన‌ల ఉంటాయ‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

తిరువనంత‌పురం, కొల్లాం, పాతాన‌మిట్ట‌, కొట్టాయం, అప్పొజా, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్, మ‌ల‌పురం, కోజికోడ్ జిల్లాల‌కు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. కొన్నూరు జిల్లాకు కూడా ఆదివారం వార్నింగ్ ఇచ్చారు. వ‌ర్షాలతో పాటు బ‌ల‌మైన గాలులు వీయ‌నున్న‌ట్లు వెద‌ర్ శాఖ తెలిపింది. ఎల్లో అల‌ర్ట్ అంటే 24 గంట‌ల్లో 6 నుంచి 11 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంది. వ‌ర్షం, వ‌రద‌లు త‌గ్గే వ‌ర‌కు ప్ర‌జ‌లు న‌దుల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించారు. చేప‌ల వేట కోసం స‌ముద్రంలోకి వెళ్ల‌రాదు అని జాల‌ర్ల‌కు కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version