MLA REDYANAYAK: నేను ఎప్పుడు చస్తాను అని ఎదురుచూస్తున్నారు…

-

తనదైన సంచలన వ్యాఖ్యలతో రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలంగాణ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్యానాయక్ మారాయి సారి కీలక వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఈయన చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే… మా నియోజకవర్గంలో నేను ఎప్పుడెప్పుడు చనిపోతాను అని ఎదురుచూసేవాళ్ళు చాలామందే ఉన్నారన్నారు. పోయినసారి ఎన్నికల్లోనూ అన్ను ఇక్కడ ఓడించడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేశారన్నారు. కానీ డోర్నకల్ ప్రజల ఆశీసులు నాకు ఉన్నాయి కాబట్టే గెలిచానన్నారు.

ఎంతమంది నా ఓటమి కోసం కలిసి కుట్ర చేసినా నేను గెలుస్తూనే ఉంటానని ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్షాల కన్నా సొంత పార్టీ నేతలతోనే చాలా ప్రమాదం అని అందరినీ హెచ్చరించారు. ఇక ఈయనకు మరియు మంత్రి సత్యవతి రాథోడ్ కు మధ్యన బేధాభిప్రాయాలు ఉండడం మూలంగానే నాయక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version