వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి కిడ్నాప్.. అనుమానాస్పద స్థితిలో మృతి !

-

నెల్లూరు జిల్లా కోవూరు మం పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ ములుముడి సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కావలి తెట్టు ప్రాంతంలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యం అయింది. అక్కడ మృత దేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మృతుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు అనుచరుడు అని తెలుస్తోంది.

దీంతో ఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్, అలానే పోలీసులు శవాన్ని పరిశీలించారు. మృతుడు సుబ్బిరామిరెడ్డి ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కిడ్నాప్ చేసినట్టు నిన్ననే కోవూరు పోలీస్ స్టేషన్లో మృతుడి భార్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు తీసుకు వెళ్లారు ? ఎందుకు తీసుకు వెళ్లారు ? ఎవరైనా ప్రత్యర్ధులు ఉన్నారా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version