స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లిన క్రమంలో షాపు నిర్వాహకులు పటాకులు కాల్చారు. దీంతో టెంట్‌పై మిరుగులు పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు టెంట్‌ను వెంటనే కిందుకు లాగడంతో పెనుప్రమాదం తప్పింది. పక్కనే పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు కమర్షియల్ షాపులకు కూడా భారీ ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.