బొమ్మలరామారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్టును రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఖండించారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు గురించి తెలుసుకున్న పలువురు నేతలు బొమ్మలరామారం వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్​లో బండి సంజయ్​ను ఉంచారన్న సమాచారం మేరకు ఆ వివరాలు తెలుసుకునేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్​కు సంఘీభావం తెలుపుతూ బొమ్మలరామారం చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రఘునందన్​కు మధ్య తోపులాట జరిగింది. ఆయణ్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ వాహనంలో వేరే చోటుకు తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ మహిళా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు.

‘ఎమ్మెల్యే అని చూడకుండా 2 కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?:
ఏ కేసులో సంజయ్‌ను అరెస్ట్ చేశారో చెప్పడం లేదు. పోలీసులు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించడం లేదు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయడంలేదు.’ అని రఘునందన్‌ రావు అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version