బంపర్ ఆఫర్.. కేంద్రం నుండి ఫ్రీగా అకౌంట్‌లోకి రూ.25 వేలు..!

-

మీరు ఫ్రీగా డబ్బులని పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. ఇలా మీరు ఫ్రీగా డబ్బులు పొందొచ్చు. అది కూడా మీరు ఎలాంటి డబ్బులని కట్టకుండానే. కేంద్రం సూపర్ ఆఫర్ ని ఇస్తోంది. ఒక ప్రత్యేకమైన కాంటెస్ట్ ని సర్కార్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే డబ్బులు పొందొచ్చు. అదేం కాంటెస్ట్ అంటే.. ఒక మంచి పోస్టర్ డిజైన్ చేస్తే చాలు. అప్పుడు మీరు ఏకంగా రూ. 25 వేలు పొందొచ్చు. పోస్టర్ డిజైన్ చేస్తే రూ. 25 వేలు ఎలా వస్తాయో చూద్దాం.

గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) ని తీసుకొచ్చింది. ఇది ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా సెల్లర్లు వారి ప్రొడక్టులను దేశ వ్యాప్తంగా విక్రయించొచ్చు. మైగౌవ్‌తో బాగస్వామ్యం కేంద్రం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పోస్టర్ డిజైన్ కాంపిటీషన్ ని నిర్వహిస్తోంది. ’’త్రి పిల్లర్స్ ఆఫ్ జెమ్: ఎఫిసియెంట్, ట్రాన్స్‌పరెంట్, ఇన్‌క్లూజివ్’’పై పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ లో పాల్గొని డబ్బులని పొందొచ్చు.

జేపీఈజీ ఫార్మాట్‌లో మీ పోస్టర్ ఉండాలి. థీమ్‌కు అనుగుణంగా పోస్టర్ ని డిజైన్ చేయాలి. అప్పుడు మీ పోస్టర్‌కు ఎంట్రీ లభిస్తుంది. ఒకవేళ మీరు విజేతగా నిలిస్తే బహుమతి ఉంటుంది. తొలి స్థానంలో ఉన్న వారికి రూ. 25 వేలు, సెకండ్ ప్లేస్‌లో ఉంటే రూ. 20 వేలు, మూడో స్థానంలో వారికి రూ. 15 వేలు వస్తాయి. 2023 మే 2 వరకు ఈ కాంటెస్ట్ ఉంటుంది. అప్పటి లోగా మీరు పోస్టర్ డిజైన్ చేసి పంపించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version