యువతకు ఈ అవకాశాలు ఇస్తాం: సంజయ్

-

కోరుట్ల నియోజకవర్గ యువత కోసం 60 కంపెనీలలో జాబ్ మేళా నిర్వహించారు. సోమవారం స్థానిక వెంకట రెడ్డి గార్డెన్లో నిర్వహించిన జాబ్ మేళా ని కోరుట్ల ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది తర్వాత ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూకి సుమారు 3500 మంది వచ్చారని ఇందులో 2000 మంది ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అన్నారు. ఉద్యోగం రాని వారు అధైర్య పడకుండా ఉండాలని భవిష్యత్తులో జాబ్ మేళాలతో పాటు వ్యాపార అవకాశాల కోసం వ్యాపార దిగ్గజాలతో సమావేశాలు ఏర్పాటు చేసి యువతని వ్యాపార రంగం వైపు కూడా వెళ్లే విధంగా కృషి చేస్తానని అన్నారు.

యువత భవిత కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. కోరుట్ల నియోజకవర్గం అలానే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తానని చెప్పారు మున్సిపల్ చైర్మన్ సుజాత బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version