వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌దేవి క‌నిపించ‌డం లేదు.. వెతికిపెట్టండంటూ ఫిర్యాదు

-

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ రెండు రోజుల క్రితం ఆ నియోజకవర్గం ప్రజలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని తుళ్లూరు పోలీస్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళలు. తమ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యేను వెతికి పెట్టాలని పోలీసులకు మహిళలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

దీంతో తమ సమస్యల్ని చెప్పుకుందామంటే…. తమ ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజధాని విషయంలో తాము గత ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ఆమె ఎందుకు దాక్కుంటున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియాతో మహిళలు మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో జగన్ కూడా చెప్పారని… అందుకే తాము తమ భూములను రాజధానికి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు తామంతా చిన్న బిడ్డలతో కలసి రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version