పీసీసీ అధ్యక్షుడు హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమే : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కుతోంది. వరుసపెట్టి కాంగ్రెస్‌కు సీనియర్‌ నేతలు రాజీనామా చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమన్నారు. పీసీసీ అధ్యక్షుడు కేవలం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి, హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమేనని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. సోనియా నాయకత్వంలోనే అందరం పని చేస్తున్నామని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.

రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మధ్య ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. మల్లు రవి మాట్లాడుతూ… రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ను చంపి, బీజేపీని బతికించే ప్రయత్నం
చేస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి. దాసోజు శ్రవణ్ పై ఒత్తిడి తెచ్చి పార్టీ మారేలా చేశారని అన్నారు. బీజేపీ వాళ్ల రాజకీయాలు  దిగజారిపోయాయని చెప్పారు మల్లు రవి. దాసోజు శ్రవణ్ పై తాను వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని… అయితే, రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండిస్తున్నానని అన్నారు మల్లు రవి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version