ఉద్యోగాల కల్పనపై రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదు : ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బోధన్‌లో యువ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనపై రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొత్తం కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించారని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10వేలు మాత్రమేనని మండిపడ్డారు. ఆ 10వేలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టే.. చివరి రెండేళ్లు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ పాలనలో అలా ఉంటే గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటే నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో 40వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ నాయకులకు కోర్టుల్లో కేసులు వేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ మంచి చేయడం లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ మారాలంటే యువత మారాలని, మార్పు యువత నుంచే రావాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, రకరకాల రూపంలో ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు ఇవ్వచూపుతున్నాయని, కరెన్సీ నోటుపై గాంధీ తాత బొమ్మ ఉంటుందని.. జేబులో గాంధీ బొమ్మ ఉంటే ఉండనివ్వండి కానీ గుండెల్లో ధైర్యం ఉండాలన్నారు. అంత ధైర్యం ఉంటే ఎంత ఎవరు కోటీశ్వరులు వచ్చిన ఎదుర్కొంటామన్నారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు. షాద ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు కావాలని ఎవరైనా కేసీఆర్‌ను అడిగారా? ఇవన్నీ ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version