ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పరిణామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు రోజులుగా ఈ పరిణామాలు అన్ని కూడా ఎంతో ఆసక్తిని ఆందోళనను రేకెత్తించాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం బలం లేకపోయినా మండలిలో తనకు ఉన్న బలం ద్వారా రాజధాని వికేంద్రీకరణ బిల్లుని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. చివరకు సఫలం అయింది.
అయితే మంగళవారం బిల్లుని అడ్డుకోవడానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి వ్యూహాలను సిద్దం చేసుకున్నారు. ఈ విషయాలను సీర్నియర్ నేతలతో కూడా ఆయన చర్చించారు. అయితే ఇక్కడే ఆయనకు పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు. ఆయన చర్చిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యూహం మొత్తం తన సన్నిహితుల ద్వారా జగన్ కి చెప్పారని అంటున్నారు.
మంగళవారం ఉదయ౦ చంద్రబాబు డొక్కా కి ఫోన్ చేసిన కాసేపటికే ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పైగా తన రాజీనామాలేఖలో అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించటాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ ఆ మనస్థాపంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన దొరికిపోవడంతోనే రాజీనామా చేసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.